రద్దీ (ట్రాఫిక్) చలాన్

विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें

రవాణా వ్యవస్థల భద్రత మరియు సరైన పనితీరు కోసం రద్దీ (ట్రాఫిక్) నియమాలను పాటించడం అవసరం. రద్దీ (ట్రాఫిక్) నిబంధనల ఉల్లంఘన వలన ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగవచ్చు. ఇది రవాణా సేవలకు అంతరాయం కలిగించవచ్చు.

खड़ी कारరద్దీ (ట్రాఫిక్) నిబంధనలను ఉల్లంఘించేవారికి రద్దీ (ట్రాఫిక్) పోలీసులు చలాన్ జారీ చేయవచ్చు. వాహనం నడిపేటపుడు (డ్రైవింగ్) అవసరమైన దస్తావేజులను (డాక్యుమెంటేషన్) తీసుకెళ్లకపోవటానికి చలాన్ జారీ చేయవచ్చు. భారత్‌లో (డ్రైవింగ్) వాహనంటప్పుడు ఈ క్రింది పత్రాలను తీసుకెళ్లండి -

  • డ్రైవింగ్ లైసెన్స్ (అసలైనది)
  • వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ప్రైవేట్ వాహనాల కోసం ధృవీకరించబడిన కాపీ మరియు వాణిజ్య వాహనాలకు అసలైనది)
  • భీమా రుజువు (కాపీ)
  • కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (అసలైనది మరియు దేశవ్యాప్తంగా లేని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తుంది)

పైన పేర్కొన్న పత్రాలను తీసుకెళ్లడంలో వైఫల్యం కలిగితే అది రద్దీ (ట్రాఫిక్) ఉల్లంఘన. మీరు రద్దీ నిబంధనలను ఉల్లంఘిస్తే రద్దీ పోలీసులు చలాన్ జారీ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉదా. చట్టవిరుద్ధంగ వాహనాన్ని నిలపడం (పార్కింగ్) మీ వాహనాన్ని కదలకుండా లేదా అదుపు చేయకుండా నిరోధించవచ్చు.

మీరు ఉల్లంఘించిన రద్దీ చట్టం యొక్క తీవ్రతను బట్టి జరిమానా మొత్తం మారవచ్చు. రద్దీ పోలీసుల నుండి మీకు చలాన్ వచ్చినప్పుడు ఏమి చేయాలి?

చలాన్ అందిన తరువాత, మీకు రెండు ఎంపికలు ఉన్నాయి.

చలాన్ జరిమానా చెల్లించండి


రద్దీ పోలీసు సిబ్బంది ఉల్లంఘన జరిగినప్పుడు జరిమానా చెల్లించడానికి మీకు ఒక ఎంపికను ఇవ్వవచ్చు లేదా మీరు దానిని న్యాయస్థానంలో (కోర్టులో) చెల్లించడానికి ఎంచుకోవచ్చు. రద్దీ పోలీసు సిబ్బందికి జరిమానా చెల్లించిన తరువాత, రశీదు తీసుకోవడం మర్చిపోవద్దు.

చలాన్‌ను తపాలా (పోస్టు) ద్వారా స్వీకరించినట్లయితే, చలాన్‌లో పేర్కొన్న విధంగా న్యాయస్థానంలో (కోర్టులో) చెల్లించండి.

నిర్ణీత తేదీకి ముందే ఎల్లప్పుడూ జరిమానా చెల్లించండి లేదా అది ఎక్కువ జరిమానా మొత్తానికి దారితీయవచ్చు.

చలాన్ వివాదం


మీరు రద్దీ (ట్రాఫిక్) నిబంధనలను ఉల్లంఘించలేదని మరియు చలాన్ లోపం ద్వారా జారీ చేయబడిందని మీరు అనుకుంటే. అప్పుడు మీరు న్యాయస్థానంలో (కోర్టులో) నేరాన్ని అంగీకరించరు.

అమాయకత్వాన్ని నిరూపించడానికి అవసరమైన రుజువులు మరియు పత్రాలను అందించండి. ఫలితాన్ని న్యాయమూర్తి నిర్ణయిస్తారు. తీర్పును గౌరవించండి మరియు సలహా ఇచ్చినట్లు పాటించండి.

రద్దీ చలాన్లను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోండి మరియు సూచించిన విధంగా వాటిని పారవేయండి.

చలాన్ స్వీకరించడంలో మీ హక్కులు


ఏదైనా ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినందుకు మీరు చల్లా పొందవచ్చు. రద్దీ చట్టం ప్రకారం, రద్దీ పోలీసులు కట్టుబడి ఉండవలసిన కొన్ని హక్కులు మీకు ఉన్నాయి.

రద్దీ చలాన్ ఎవరు జారీ చేయవచ్చు?

రద్దీ పోలీసు అధికారి చలాన్ జారీ చేయవచ్చు, సాధారణ పోలీసు సిబ్బంది కాదు. హెడ్ ​​కానిస్టేబుల్ లేదా ఉన్నత పదవిలో ఉన్న అధికారులు మాత్రమే చలాన్ జారీ చేయవచ్చు.

ప్రత్యేక దుస్తులు (యూనిఫాం) చేతిలో ఉన్న ‘వి’ ఆకారం యొక్క 3 చారల ద్వారా హెడ్ కానిస్టేబుల్‌ను గుర్తించవచ్చు. కానీ, వారు ₹100 వరకు మాత్రమే జరిమానా జారీ చేయగలరు. కాని, బహుళ ఉల్లంఘనలు జరిగితే, అతను వేర్వేరుగా బహుళ జరిమానాలను జారీ చేయడానికి అనుమతించబడతాడు.

ఉదాహరణకు: మీరు శిరో రక్షకం (హెల్మెట్) ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ, రద్దీ చిహ్నము (ట్రాఫిక్ సిగ్నల్) దూకుతె హెడ్ కానిస్టేబులు 100 చొప్పున రెండు వేర్వేరు చలాన్లను జారీ చేయడానికి అధికారం ఉంది.

వాణిజ్య వాహనాల రద్దీ నిబంధనల ఉల్లంఘనలకు హెడ్ కానిస్టేబుల్ చలాన్ జారీ చేయలేరు.

పోలీసులు ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్‌లను తీసుకెళ్లగలరా?

రద్దీ పోలీసు కార్యాలయం డ్రైవింగ్ లైసెన్స్, నమోదీకరణ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ - ఆర్‌సి), ఇన్సూరెన్స్ రుజువు వంటి మీ వాహన సంబంధిత పత్రాలను అడగవచ్చు. అయితే న్యాయస్థానంలో (కోర్టులో) హాజరు తప్పనిసరి అయిన చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తే తప్ప వారు ఆ పత్రాలను జప్తు చేయలేరు.

క్రింది పరిస్థితులలో మీరు పత్రాలను రద్దీ(ట్రాఫిక్) పోలీసు కార్యాలయానికి అప్పగించాలి -

  • ఉల్లంఘన జరిగినప్పుడు జరిమానా చెల్లించడానికి మీకు తగినంత డబ్బు లేని పరిస్థితిలో మీరు మీ పత్రాలను తిరిగి పొందడానికి న్యాయస్థానంలో (కోర్టులో) చెల్లింపు చేయాలి.
  • మీరు న్యాయస్థానంలో (కోర్టులో) చలాన్‌ను సవాలు చేయాలనుకుంటే. అప్పుడు మీరు ఏదైనా పత్రాన్ని అప్పగించి, నియమించబడిన న్యాయస్థానంలో (కోర్టుకు) వెళ్ళవచ్చు.
  • మద్యం ప్రభావంతో వాహనం నడుపుట (డ్రైవింగ్). రక్తంలో మద్యం (ఆల్కహాల్) మొత్తాన్ని కొలవడానికి పోలీసులు శ్వాస విశ్లేషణ (బ్రీత్ ఎనలైజర్) పరికరాన్ని ఉపయోగించవచ్చు, అయితే మీరు న్యాయస్థానంలో (కోర్టులో) వివాదం చేయవచ్చు. గుర్తుంచుకోండి, శ్వాస విశ్లేషణను (బ్రీత్ ఎనలైజర్‌ను) ఉపయోగిస్తున్నప్పుడు రద్దీ (ట్రాఫిక్) పోలీసులు దృశ్యాన్ని భద్రపరుస్తారు (వీడియో రికార్డింగ్).
  • నడపడానికి సురక్షితం కాని అటువంటి వాహనాన్ని నడపడం.
  • నమోదీకరన (రిజిస్ట్రేషన్) లేకుండా వ్యక్తిగత (ప్రైవేట్) వాహనాన్ని లేదా అనుమతి లేకుండా వాణిజ్య వాహనాన్ని నడపడం.

గుర్తుంచుకోండి: రద్దీ పోలీసులు మీకు రశీదు ఇవ్వకుండా మీ పత్రాలను జప్తు చేయలేరు.

పోలీసులు వాహన తాళం తీసుకోవచ్చా?

చట్టం ప్రకారం, మీరు వాహన తాళం రద్దీ పోలీస్ కార్యాలయానికి అప్పగించడానికి కట్టుబడరు. కొన్ని పరిస్థితులలో ఉన్నప్పటికీ, రద్దీ పోలీసులు మీ వాహనాన్ని తాళం లేదా లేకుండా జప్తు చేయవచ్చు.

మీ వాహనాన్ని జప్తు చేయగలిగే కొన్ని పరిస్థితులు క్రింద పేర్కొనబడ్డాయి -

  • మద్యం ప్రభావంతో వాహనం నడపడం (డ్రైవింగ్).
  • డ్రైవింగ్ లైసెన్స్ లేదా సరైన నమోదీకరణ (రిజిస్ట్రేషన్) లేకుండా వాహనం నడపడం (డ్రైవింగ్).
  • మైనర్ వాహనం నడుపుతున్నాడు.
  • నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తూ వాణిజ్య వాహనాన్ని నడపడం లేదా అనుమతి లేకుండా వాహనాన్ని నడపడం (డ్రైవింగ్).

పోలీసులు చలాన్ జారీ చేయవలసిన అవసరాలు ఏమిటి?

రద్దీ పోలీసు సిబ్బంది తప్పనిసరిగా తెల్లని ప్రత్యేక దుస్తులు (యూనిఫామ్) ధరించి దానిపై పేరు పట్టిక (నేమ్ ట్యాగ్) ఉండాలి. వారు తప్పనిసరిగా "చలాన్ పుస్తకం" లేదా "ఇ-చలాన్ పరికరం" కలిగి ఉండాలి.

చట్ట ఉల్లంఘనలు మరియు సంబంధిత జరిమానాల గురించి సమాచారం


ఇటీవలి మోటారు వాహనాల (సవరణ) బిల్లు2019 రద్దీ ఉల్లంఘనలకు జరిమానాలను గణనీయంగా పెంచింది. ఈ వ్యాసం మోటారు వాహన చట్టంలోని మార్పులపై మరింత వెలుగునిస్తుంది. రద్దీ ఉల్లంఘనల గురించి మరియు జరిమానాలు (ఆర్థిక మరియు జైలు శిక్ష) గురించి సమగ్ర సమాచారం ఇక్కడ ఒక పత్రికా ప్రకటనలో అందుబాటులో ఉంది.

 

 

शब्द ज्ञान

रुचिकर (विशेषण)

अर्थ:- रुचि के अनुकूल या अच्छा जान पड़नेवाला।

उदाहरण:- यह मेरा मनपसंद खाना है।

पर्यायवाची:- अभीष्ट, ख़ुशगवार, खुशगवार, पसंद का, पसंदीदा, पसन्दीदा, प्रिय, मनचाहा, मनपसंद, मनपसन्द, मनभाता, मनभावन