యువ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్

विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें

టీనేజీలో (యుక్తవయసులో) మీ స్వంత వాహనాన్ని నడపగలరు అనే ఒక్క పరిపూర్ణ కల్పన చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. కాని ఏ ఒక వాహనాన్ని నడపడం అనేదానికంటే అది పెద్ద భాద్యతగా ఉంటుంది: ఏ ఒక చిన్న ప్రమాదం కూడా పెద్ద తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అందువలన, యుక్తవయసుగల వాహన చాలకులకు నియమాలు మరియు నిబంధనలు నిర్ధిష్ట వయస్కుల కంటే విభిన్నంగా ఏర్పాటు చేయబడింది.

అవసరాలు మరియు సమస్యల గురించి మీకు బాగా తెలిజేయడానికి. టీనేజ్ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన నవీకరించిన సమాచారాన్నిఈ క్రింద మేము మీకు అందిస్తున్నాము.

 

యుక్త వయసు వారి కి డ్రైవింగ్ లైసెన్స్ యొక్క పద్ధతులు


  • 16 సంవత్సారాలకు క్రింద ఉన్నవారు – డ్రైవర్ లైసెన్స్ కు అనర్హులు
  • 16 – 18 సంవత్సరాలు - లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ (తల్లిదండ్రులు అంగీకారంతో)
  • 18-20 సంవత్సరాలు – శాశ్వత డ్రైవర్స్ లైసెన్స్ (వ్యక్తిగత ప్రయాణికుల వాహనాలకు మాత్రమే)
  • 20 సంవత్సరాల పైన ఉన్నవారు – అన్ని విధాల వాహనాలకు శాశ్వత డ్రైవర్స్ లైసెన్స్

 

వయస్సు ప్రకారం వాహన నడపడం యొక్క అర్హత


  • 16-18 సంవత్సరాలు – 50cc ఇంజిన్ సామర్థ్యంగల ద్విచక్ర వాహనాలు
  • 18-20 సంవత్సరాలు – అన్ని విధాల వ్యక్తిగత వాహనాలు
  • 20 సంవత్సరాల పైన ఉన్నవారు – అన్ని విధాల వాహనాలు

 

పరీక్షలు మరియు దరఖాస్తు ప్రక్రియ


దరఖాస్తుదారులు లెర్నర్స్ లైసెన్స్ కోసం రాత పరీక్షను (ఆన్లైన్/ఆఫ్లైన్) పూర్తింప చేయాలి. ప్రాంతీయ RTO కార్యాలయం నుండి రహదారి సంకేతాలు, నియమాలు మరియు నిబంధనల కాపీని పొందండి మరియు అవసరమైన డ్రైవింగ్ నియమాలను తెలుసుకోండి.

రహదారి చిహ్నాల ధృవీకరించబడిన మరియు నవీకరించబడిన సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం, మీరు డ్రైవింగ్ పరీక్షను కూడా పూర్తి చేయాలి. శాశ్వత లైసెన్స్ కోసం, ప్రత్యేక వాహన యొక్క విధానానికి తగిన డ్రైవింగ్/శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

యుక్తవయస్కుల లైసెన్స్ దరఖాస్తు పద్దతి యొక్క వివరణాత్మక సూచనలు ఇక్కడ లభ్యం.

 

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు


యుక్తవయసుల డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ క్రింది అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

  • మీకు ప్రత్యేకమైన RTO ఉంటే, "లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష సమాచార దస్తావేజు" కోసం అడగండి; పరీక్షించబడుతున్న ప్రత్యేకతలను తిరిగి ధృవీకరించడానికి ఇది మీకు సహాయపడుతుంది.
  • మీరు ఒక వేళ ఆన్‌లైన్ పరీక్షను ఎంచుకొని ఉంటె దాని కోసమే రుసుము చెల్లించండి. ఆన్‌లైన్ స్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన ఫీజులో పరీక్ష ఫీజు కలపబడి ఉండదు(మీరు పరీక్షకు హాజరైతే మాత్రమే చెల్లించాలి).
  • వేదికకు అన్ని అసలయిన నమోదులు , కాపీలు మరియు స్లాట్ బుకింగ్ రశీదును తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
  • లెర్నర్స్ లైసెన్స్ పొందటానికి, మీ తల్లిదండ్రుల అంగీకారం కోసం ఫారం 1 లేదా 1A పై సంతకం చేయించుకోవడం మర్చిపోవద్దు.
  • కేవలం ప్రభుత్వ వైద్య అధికారి మాత్రమే మీ ఫారం 1 ఎ (సారథి దరఖాస్తుదారులు) లేదా అవసరమైన మెడికల్ సర్టిఫికేట్ ఫారం నంబర్. (ఆఫ్‌లైన్ దరఖాస్తుదారుల కోసం) ను ధృవీకరించగలరు.

 

 

शब्द ज्ञान

पुनर्निरीक्षण (संज्ञा)

अर्थ:- फिर से निरीक्षण।

उदाहरण:- मतदाता सूचियों के पुनरीक्षण का काम शुरु है।

पर्यायवाची:- पुनरीक्षण