వాహనాన్ని నడపడానికి అనుజ్ఞపత్రం (డ్రైవింగ్ లైసెన్స్) గురించి సమాచారాన్ని కనుగొనడం చాలా కష్టమైన పని. చాలా సమాచారం సేకరించిన తర్వాత కూడా మీకు కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించదు. మీకు సహాయపడే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఇక్కడ మేము సమాధానం ఇచ్చాము.
అభ్యసకుని అనుజ్ఞపత్రంకి వైద్య యోగ్యతా పత్రం (లెర్నర్ లైసెన్స్‌కు మెడికల్ ఫిట్‌నెస్ ఫారం) తప్పనిసరా?
అభ్యసకుని అనుజ్ఞపత్రం (లెర్నింగ్ లైసెన్స్) దరఖాస్తుదారులందరూ వాహనాన్ని నడపడానికి సరిపోవాలి. వారు పత్రం 1 లో శారీరక యోగ్యత (ఫిజికల్ ఫిట్‌నెస్‌ను) ప్రకటించాలి మరియు పత్రం (ఫారం) 1ఎ లో వైద్య యోగ్యత (మెడికల్ ఫిట్‌నెస్) యొక్క రుజువును జతచేయాలి.
నా దరఖాస్తులో తప్పు సమాచారం సమర్పించినట్లయితే నేను ఏమి చేయాలి?
సమర్పించిన తర్వాత దరఖాస్తును సవరించడం సాధ్యం కానందున, మీరు దరఖాస్తును రద్దు చేసి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. అయితే,రుసుము చెల్లించినట్లయితే రుసుము (ఫీజు) తిరిగి చెల్లించబడదు.
అభ్యసకుని వాహనాన్ని నడపడిపే అనుజ్ఞపత్రం (లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్‌తో) పరిమితులు ఏమిటి?
మీరు అభ్యసకుని అనుజ్ఞపత్రం(లెర్నర్ లైసెన్స్) కలిగి ఉంటే 3 నియమాలు పాటించాలి.
- మీరు మీ వాహనం యొక్క రెండు వైపులా "ఎల్" (“L”) గుర్తు రంగు (పెయింట్) వేయాలి లేదా అతికించాలి - వెనుక మరియు ముందు.
- మీరు మరొక వ్యక్తి వాహనాన్ని నడపడిపేటప్పుడు (డ్రైవింగ్) మీతో పాటు శాశ్వత అనుజ్ఞపత్రం (లైసెన్స్) ఉండాలి.
- మీ బోధకుడు తప్ప మీరు వేరే వ్యక్తిని లేదా ప్రయాణీకుడిని మీతో తీసుకెళ్లలేరు.
నేను అభ్యసకుని అనుజ్ఞపత్రం (లెర్నర్ లైసెన్స్) పరీక్షకు హాజరుకాకపోతే ఏమి జరుగుతుంది?
అనుజ్ఞపత్రం (లైసెన్స్) పరీక్ష కోసం మీరు మళ్ళీ నియమాపకం(అపాయింట్మెంట్) తీసుకోవాలి.
నేను అభ్యసకుని అనుజ్ఞపత్రం (లెర్నర్ లైసెన్స్) కోసం రాసే పరీక్షలో విఫలమైతే నేను ఏమి చేయాలి?
మీరు పరీక్ష కోసం రుసుమును మళ్ళీ చెల్లించాలి మరియు మరొక నియమాపకం (అపాయింట్మెంట్) తీసుకోవాలి.
నేను వాహనాన్ని నడిపే రహదారి (రోడ్ డ్రైవింగ్) పరీక్షలో విఫలమైతే ఏమి చేయాలి?
మీరు వాహనాన్ని నడిపే (డ్రైవింగ్) పరీక్షలో విఫలమైతే, మీరు 7 రోజుల తర్వాత తిరిగి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నా అభ్యసకుని అనుజ్ఞపత్రం (లెర్నర్ లైసెన్స్) గడువు ముగిసిన తర్వాత నేను వాహనాన్నినడిపే అనుజ్ఞపత్రం (డ్రైవింగ్ లైసెన్స్) కోసం దరఖాస్తు చేయవచ్చా?
మీ అభ్యసకుని అనుజ్ఞపత్రం (లెర్నర్ లైసెన్స్) గడువు ముందే మీరు వాహనాన్నినడిపే అనుజ్ఞపత్రం (డ్రైవింగ్ లైసెన్స్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. అభ్యసకుని అనుజ్ఞపత్రం గడువు ముగిసినట్లయితే, మీరు మళ్ళీ అభ్యసకుని అనుజ్ఞపత్రం పొందాలి.
అభ్యసకుడు వాహనాన్నినడిపే అనుజ్ఞపత్రం (లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్) నా రాష్ట్రం వెలుపల చెల్లుబాటు అవుతుందా?
అభ్యసకుడు వాహనాన్నినడిపే అనుజ్ఞపత్రం భారత్ అంతటా చెల్లుతుంది.
అభ్యాసకుని అనుజ్ఞపత్రం యొక్క చెల్లుబాటు ఏమిటి?
అభ్యసకుని అనుజ్ఞపత్రం (లెర్నర్ లైసెన్స్) యొక్క చెల్లుబాటు 6 నెలలు.
వాహనాన్నినడిపే అనుజ్ఞపత్రం (డ్రైవింగ్ లైసెన్స్) యొక్క చెల్లుబాటు ఏమిటి?
- రవాణా తరగతి వాహనం నడపడానికి అనుజ్ఞపత్రం (డ్రైవింగ్ లైసెన్స్) జారీ చేయబడితే / పునరుద్ధరించబడితే, అనుజ్ఞపత్రం ఇచ్చిన (లైసెన్స్ ఇష్యూ) లేదా పునరుద్ధరణ తేదీ నుండి 5 సంవత్సరాల కాలానికి ప్రభావవంతంగా ఉంటుంది.
- ఏదైనా ఇతర వాహనాన్నినడిపే అనుజ్ఞపత్రం (డ్రైవింగ్ లైసెన్స్) విషయంలో అనగా వాహనం యొక్క రవాణా రహిత తరగతి మాత్రమే ఉంటుంది, చెల్లుబాటు ఈ క్రింది విధంగా ఉంటుంది: అనుజ్ఞపత్రం (లైసెన్స్) పొందిన వ్యక్తి ఉంటే:-
-
ఇచ్చిన తేదీ లేదా పునరుద్ధరణ తేదీన 30 సంవత్సరాల వయస్సును సాధించలేదు, అలాంటి వ్యక్తులు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రభావవంతంగా ఉంటుంది.
లేదా -
30 సంవత్సరాల వయస్సును చేరుకుంది, కాని ఇచ్చిన తేదీ లేదా పునరుద్ధరణ తేదీపై 50 సంవత్సరాల వయస్సును పొందలేదు అటువంటప్పుడు పునరుద్ధరణ తేదీ నుండి 10 సంవత్సరాల కాలానికి ప్రభావవంతంగా ఉంటుంది.
లేదా -
50 సంవత్సరాల వయస్సును చేరుకుంది, కాని ఇచ్చిన తేదీ లేదా పునరుద్ధరణ తేదీన 55 సంవత్సరాల వయస్సును సాధించలేదు, అలాంటి వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రభావవంతంగా ఉంటుంది.
లేదా - ఇచ్చిన తేదీన 55 సంవత్సరాల వయస్సును చేరుకుంది లేదా ఒకవేళ, దాని పునరుద్ధరణ అటువంటి ఇష్యూ లేదా పునరుద్ధరణ తేదీ నుండి 5 సంవత్సరాల కాలానికి ప్రభావవంతంగా ఉంటుంది.
-
ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లే వాహనాలను నడపడానికి ఆమోదం (ఎండార్స్‌మెంట్) చెల్లుబాటు ఏమిటి?
మూడు సంవత్సరాలు.
నా అభ్యసకుని అనుజ్ఞపత్రంను (డ్రైవింగ్ లైసెన్స్) పునరుద్ధరించడం మరచిపోతే పాటించాల్సిన విధానం ఏమిటి?
మీరు మీ అనుజ్ఞపత్రంను (లైసెన్స్) పునరుద్ధరించడం మర్చిపోయి ఉంటే, గడువు తేదీ నుండి 5 సంవత్సరాలలోపు మీరు క్రొత్తదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం మీరు జరిమాన (పెనాల్టీ) ఛార్జీలు చెల్లించాలి.
అయితే, గడువు ముగిసిన అనుజ్ఞపత్రంతో (లైసెన్స్) వాహనం నడపడం నేరం అని మీరు తెలుసుకోవాలి.